ప్రభువునందు ప్రియులైన సంగస్థులకు, స్రయోభిలాషులకు ఈ పేజీ చదువుచున్న పాఠకులకు నా శుభాభివందనాలు తెలియజేయ సంతసించుచున్నాను. సాలూరు పట్టణమునకు జర్మనీ దేశస్థుడైన రెవ. స్యూ దొరగారి ద్వారా మొదటిగ సువార్త పరిచర్య ప్రారంభించబడినది. తద్వారా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి స్థాపించబడినది. హోం రోమన్ కేథలిక్కులు, పెంతెకోస్తు, ఎల్,ఇఎఫ్., యితర ఫెలోషిప్స్ ద్వారా సువార్త వెదజల్లబడుతులది. సాలూరునరిదు ఫిలడెల్ఫియా లెహ్రు హాస్పిటలు, రూధరన్ మిషను దాఖ్‌రా సాపిరిచబడుటను బట్టి హాస్ఫిటలు సిబ్బ౦ది లూథరన్ దేవాళయము యొక్క సహవాసములో ఉండెడివారు. కల్వరి చర్చి ప్రారంభ దినాలలో’సౌలూరు నందు 13సంఘాలు ఉండేవి, సుమారు 6000 క్రైస్తవులు ఉన్నారు. నేను. నా భార్య బాప్టిస్టు స౦ఘ కాపరుల సంతానమగుట చేత సాలూరు నందు ఉద్యోగరీత్యా ఉండుటను బట్టి చుట్టు పట్ల ఉన్న పట్టణములలో బాప్టిస్టు చర్చిలు ఉండి ఇక్కడ లేనందుకు బాధపడేవారము. సాలూరులో కూడ ఒక బాప్టిస్టు చర్చి ఉంటే బాగుండుననుకొనేది నా భార్య కీ" శే" శాలీనా కటాక్షము. బాప్టిస్ట్ చర్చ్ లేదు, గాన మేము లూథరన్ చర్చి సహనాసంలో ఉండేవాళ్ళము. లెప్రసీ మిషన్ హాస్పిటలు నందు నా సహ ఉద్యోగస్తురాలైన శ్రీమతి జి. రీటా సాగరు తేది 16-10_2002 ఉదయం నాతో మాట్లాడుతూ “మేనేజర్ గారూ! మీరు ఒక చర్చి పెడితే బాగుండును కదా ! మేము మీ చర్చికి వచ్చెస్తాము” అని అన్నపుడు నా భార్య 01-10-2002 చనిపోవుటను బట్టి బహుశ నేను దుఃఖంలో ఉన్నానని మైండ్ డైవర్ట్ చేయుటకు అలా అన్నారని, నిజ౦గ సీరియస్ గానే అంటున్నావామ్మా అన్నప్సడు “నిజంగానే సార్ సీరియస్‌గానే మిమ్మలను చర్చి పెట్టమంటున్నాను అన్నారు. చర్చి పెట్టడం అంటె మనం చేయలేము. ఏదైనా డేవుని చిత్తము ఉండాలి. అయినా ప్రార్ధన లో పెడతాను. నీవు కూడా ప్రార్ధన లో పెట్టు అని చెప్పను. ఆ దినము నుంచి ఈ విషయమై దైవ చితము కొరకు ప్రార్ధన ప్రారంబమైచితిని. తేది 21-10-2002 రాత్రి వూహిరిచవి రీతిలో నా భార్య షాలిని వచ్చి “సుక్కూ! ఇంకా ఈలాగునరామి? లేవండి మన చర్చికి వెల్దాము అంది. అది కల అని గ్రహించాను . బాఫ్టిస్టు చర్చి సాలూరులో ఉ౦టే బాగుండుననే నా భార్య ఆశ కల కలగా ప్రభువు తెలియఫరిచాడని ప్రభువును స్తుతించాను. మరుసటి దినము 22-10-2002 ఉదయము ఆఫీస్ లో శ్రీమతి రీటా సాగర్ గారితో "అమ్మ మనము బాప్టిస్ట్ చర్చి పెడుతునం". గాన మనం ఈ విషయమై పట్టుదలతో ప్రార్ధన చేద్దాము అని చెప్పాను. పిదప చర్చి స్థాపిరిచాంని నా ప్రియ మిత్రుడు, సహోద్యొగియైన శ్రీ బి. ప్రేమాసందరిగారితో పంచుకున్నపుడు చాల సంతోషించి, తానూ ఈ విషయమై పూర్తి సహకారము ఇస్తానని తెలియపరిచారు. ఈ విధముగా సాలూరు లో ఉన్న బాప్టిస్ట్ లకు అందుబాటు లో బాప్టిస్ట్ చర్చి ప్రారంభించుటకు ప్రభువు ప్రేరేపించారు. ఈ విషయము నా శ్రయోభిలాషులా తో పంచుకునాన్పుడు వారు సంతోషించి దావుని కార్యములో తమ వంతు కృషి చింతామణి హామీ ఇచ్చి వారి వ్యక్తిగత ప్రార్ధనలలోనే కాకుండా ప్రతి శుక్రవారం సాయంత్రం మా గృహము లో ఉపవాస ప్రార్ధనలు, గొలుసు ప్రార్ధనలు ప్రారంభించితిమి. ఈ ప్రార్ధన సహవాసములూ క్రమమం తప్పకుండ ఈ క్రింది వారు నాతోపాటు పాల్గొనాదివారు. శ్రీమతి & శ్రీ ప్రేమానందం, శ్రీమతి & శ్రీ జి.జ్.వ్ సాగర్, డా: మరియా అబ్రహం, శ్రీమతి & శ్రీ ప్.జ్ పృథివిరాజ్, శ్రీమతి లలిత ప్రసాద్, శ్రీ ప్. సత్యం శ్రీ సక్రు మహతో మరియు శ్రీమతి చినతల్లి. బాప్టిస్ట్ చర్చి పెడుతున్నట్లు తెలిసి కి .శే. వై. ఏ. గాబ్రియేల్ గారు నను అభినందించి తన పూర్తి సహకారము అందించుటకు పూనుకున్నారు. ఆరోగ్యరీత్యా బలహీనము అయినప్పటికీ వారూ, శ్రీ బి. ప్రేమానందం గారు, నాతో పటు గృహాలు దర్శించి క్రిస్తవేతరుల గృహాలు కూడా దర్శించి బాప్టిస్ట్ చర్చి గురుంచి అవగాహనా కల్పించే వాళ్ళము. నూతన ఆత్మలు ప్రభువు తట్టు త్రిప్పుటకు ప్రతి దినం తిరిగేవాళ్ళం(సాయంకాలం). ఎవరైతేక్జేస్తవులై ఉండ్ చర్చికి దూరంగా ఉండేవారో వారినే మేము పరిగణంలోకి తీసుకొనవలము. జానూరి1 2003 నుంచు ఆరాధనా ప్రారంభించాలనే ఆలోచన కలిగినప్పుడు మా ప్రార్ధన సహవాసం లో ఉండే, శ్రీ జి.జ్.వ్ సాగర్ గారు, శ్రీరామ కాలనీ లో ఉండే ఒక గృహమును ఏర్పాటు చేసితిరి. నా జీతంతో నైనా సరే క్వాలిఫైడ్ పాస్టర్ గారిని నియమించాలని అనుకున్నారు. బాప్టిస్ట్ చర్చి ప్రారంభాప్రయత్నాములు జరుగుతున్నాయని తెలిసిన పిమ్మట కొందరు మమ్మును అభినందించారు. మొదటినుండి ఉన్న డినామినేషన్ కాకుండా వేరే డినామినేషన్ చర్చి ఉండకూడదని, ఒక వర్గంవారు ఆ ప్రయత్నం మనుకోమని నాకు హెచ్చరికలు పంపేవారు. చివరకు నా ఉద్యోగమునకు హాని కల్పించాలని మిషన్ నేషనల్ & ఇంటర్నేషనల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయుట కూడా జరిగినది. ఇదే సమయంలో సాలూరు పట్టణమందు క్రిస్టియన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో యూజీవ కూటములో వాక్య పరిచర్యకు చెన్నై నుంచి బ్ర: మధు, సిస్టర్ జెస్సి వచ్చియున్నారు. బ్ర: మధు గారిని కలిసి నేను బాప్టిస్ట్ చర్చి పెట్టాలనే ఉదశంలో యునాని వారి ప్రార్ధనలు కోరినప్పుడు అయన ప్రార్దించిన మీదట ఈ విధంగా హెచ్చరించారు - సుకుమార్ గారు! మీరు చర్చి ప్రారంభించుట ప్రభువునకు ఇష్టమైన క్రియలాఉంది. కానీ మీరు చాల సమస్యలు ఎదుర్కొనబోవుచున్నారు. ఇంక పట్టువిడవకుండా ప్రార్ధన లో గడపాలి తప్పకుండా మీరు దానిని సాదించబోవుచున్నారు" అని చేపినపుడు నాలోని ఆనందానికి అవధులు లేవు. ప్రభువుని స్తుతించి మా ప్రార్ధన బృందమునకు తెలియచేసినపుడు ఇంకా పట్టుదలతో విశ్వసంతో ప్రార్థనలలో పాల్గొనేవారు. తరువాత చర్చి ప్రారంబిస్తున్నామనే ఉద్దశమును సాలూరు లోని సంగములన్ని ఐక్యపరచినా క్రిస్టియన్ మైనారిటీస్ ఫౌండర్ & ప్రెసిడెంట్, ప్.ల. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైన డా: బి.పీ. రవికుమార్ , విస్ప్రెసిడెంట్ గారైన డా: వై.సి పాల్ వ్యక్తిగతం గా చర్చించినప్పుడు, వారు తమ పూర్తి సహకారం అందింస్తామని అభయహస్తం ఇచ్చారు. ఇటువంటి సమయంలో ఒక బలమైన చర్చి అండ ఉంటె మంచిదని మాలో ఆలోచన కలిగినది. ఈ విషయమై అప్పటి దినాలలో కల్వరి బాప్టిస్ట్ చర్చి ఖజానా దారునిగా ఉన్న మా తొడలుడైన కి .శే. ఐ. ఏ. రాయల్ గారితో ఈ ఉదేశముని పంచుకొనుట జరిగినది. మా ఉదేశమును తమ సాంగ పెద్దలకు తెలియజేయవలసిందిగా కోరితిమి.